సిపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె. ఈశ్వరయ్య గారికి గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి మరియు మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు ఈరోజు స్టార్ హాస్పిటల్‌కు వెళ్లి శ్రీ ఈశ్వరయ్య గారిని పరామర్శించారు.ఈశ్వరయ్య గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకొని ప్రజా జీవితంలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అలాగే ఈశ్వరయ్య గారి సతీమణి, సీనియర్ జర్నలిస్ట్ అజిత గారిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా శ్రీ ఈశ్వరయ్య సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని శ్రీ జూపూడి ప్రభాకర రావు ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం ఆయన అందిస్తున్న సేవలు మరింత కాలం కొనసాగాలని అభిలషించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *