ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల్లో మొత్తం రూ.5.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు విద్యుత్ సంబంధిత అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ పర్యటనలో భాగంగా ముందుగా ముక్తినూతలపాడు గ్రామంలో కిమ్స్ ఆసుపత్రి మీదుగా వచ్చే రహదారిపై ఎన్‌ఎస్‌పీ (NSP) కెనాల్‌పై కల్వర్టు నిర్మాణానికి రూ.20 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి, రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన త్రీఫేజ్ విద్యుత్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా ముక్తినూతలపాడు గ్రామం నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.90 లక్షల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ముక్తినూతలపాడు గ్రామం నుంచి గుడిమెళ్లపాడు మీదుగా దసరాజుపల్లె గ్రామం వరకు రూ.1.80 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.ఈ సందర్భంగా ముక్తినూతలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామాల్లోఒక్క అభివృద్ధి పని జరగలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యాల అభివృద్ధి ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని తెలిపారు. ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు గ్రామాల పరిధిలో రూ.5.40 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, డివిజన్ అధ్యక్షులు రామాంజినేయులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *