ఈ మధ్య వెలువడిన నీట్ పిజీ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 509 సాధించిన ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు గారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ గుప్తాని ఈరోజు కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం, కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాష డీఎస్పీ కార్యాలయంలో శాలువాతో సన్మానించి, స్వీట్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పిజీ నీట్ 509 ర్యాంక్ సాధించడం గొప్పవిషయమని అన్నారు. మంచి ర్యాంకు సాధించి మీ తల్లిదండ్రులకు,కందుకూరు మంచి పేరు తెచ్చావాని కొనియాడారు.ఇలాగే బాగా చదివి పీజీ పూర్తి చేసి సమాజానికి, పేదలకు మరింత సేవ చేయాలని డిఎస్పి ఆకాంక్షించారు. ఎంతో ఇష్టపడి కష్టపడి చదివితేనే ఇలాంటి మంచి ర్యాంకు వస్తుందని, ఎటువంటి కోచింగ్ లేకుండా ఆల్ ఇండియా ర్యాంక్ 509 సాధించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మంచి డాక్టర్ గా సమాజానికి సేవలు అందించాలని సిఐ అన్వర్ భాష ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *