గుడ్లూరు మండలం తెట్టు ఎస్టీ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కల నేడు సాకారమైంది. 40 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను నా చేతుల మీదుగా అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది.ఎన్నికల ప్రచార సమయంలో కాలనీవాసులు తమకు ఇళ్ల స్థలాలు కావాలని కోరారు. వారికి ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నా లక్ష్యం.తెట్టు ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు త్వరలో చేపడతాం. అలాగే తెట్టు–రామాయపట్నం మధ్య కొత్త రహదారి నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి.మోచర్ల పంచాయతీలో ఇప్పటికే రూ.25 లక్షలతో మౌలిక వసతులు, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో చెరువు కట్ట పటిష్టీకరణ పనులు చేపట్టాం.కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో సేవ, ముఖ్యమంత్రి సహాయనిధి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీస్సులు, మద్దతు అందించాలని కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *