ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 100 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)యన్.యుగంధర్ బాబు గారు మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్రంగా విచారణ జరిపి, నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అడిషినల్ ఎస్పీ గారు ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీసు కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీసు శాఖ భరోసాగా నిలవాలని, ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఫిర్యాదుల పరిష్కారం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, కొండేపి ఎస్సై త్యాగరాజు, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్,ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.