గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పద్మశ్రీ, MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను గుంటూరుకు చెందిన ముస్లిం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతి, అనంతరం ఆయన తల్లి మౌలాబి మృతి ఘటనలపై వాస్తవాలను వెలికితీసేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న “చలో ఒంగోలు” కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముస్లిం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తూ నిరంతరం కృషి చేస్తున్న మందకృష్ణ మాదిగను ముస్లిం న్యాయవాదులు అభినందించారు.ఈ సందర్భంగా సుమారు 50 వేల మందితో ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రజలను సమీకరించడం తదితర అంశాలపై “చాయ్ విత్ మందకృష్ణ మాదిగ” కార్యక్రమంలో న్యాయవాదులు చర్చించారు.ఈ సమావేశంలో న్యాయవాదులు షేక్ సుభాని, షేక్ గౌస్ బాషా, అనీఫ్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *