కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో
కొండపి ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్లేట్లు, గ్లాసులు మరియు సిబ్బందికి యూనిఫామ్ మంత్రి పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీలుగా పదోన్నతులు పొందిన ముగ్గురు ఆయాలను మంత్రి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….అంగన్వాడీ కేంద్రాలలో మహిళలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించడంతో పాటు వాటికి స్వంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి..సకాలంలో టీచర్లకు జీతాలు చెల్లించే వారు కాదు.. టీచర్లు నానా ఇబ్బందులు పడేవారన్నారు. నేడు క్రమంగా ప్రతీనెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచిందని గుర్తుచేశారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లలో టెలివిజన్, ఆర్వో వాటర్, ఆట వస్తువులు, చార్టులు ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇలా అన్ని వసతులు కల్పించినట్టు చెప్పారు. అంగన్వాడీ
సెంటర్లలో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయని మంత్రి వివరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *