తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకొని, కుటుంబ సంక్షేమ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్–2026” లో భాగంగా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి తెలిపారు.అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 9:00 గంటలకు కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు.ఈ వైద్య శిబిరంలో కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్యుల సలహాలు మరియు ఆరోగ్య పై అవగాహన తో పాటు ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్, తో పాటు అనేక రకాల రక్తపరీక్షలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని,ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య శిబిరానికి హాజరై వైద్యుల సలహాలు పొందాలని కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి విజ్ఞప్తి చేశారు.