గిద్దలూరు మండల తహశీల్దార్‌గా విధులు నిర్వహించిన శ్రీ M. ఆంజనేయ రెడ్డి గారికి ఈరోజు పదవీ బదిలీ జరిగిన సందర్భంగా గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తహశీల్దార్ శ్రీ M. ఆంజనేయ రెడ్డి గారి సేవలను కొనియాడారు. విధుల నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, ప్రజలకు అందించిన సేవలు, సిబ్బందితో సమన్వయం, పరిపాలనా దక్షతను ప్రశంసించారు.అనంతరం అధికారులు, సిబ్బంది శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయన బదిలీ అయిన కొత్త స్థానంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ A నాయబ్ హుస్సేన్, రిటైర్డ్ DT సుబ్బారావు, మండల సర్వేయర్ M ఆంజనేయులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ G భాస్కర్ రావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర కోశాధికారి Y P రంగయ్య మరియు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అరిగేలా వెంకట రామయ్య, B రాజశేఖర్ రెడ్డి, G అచ్చయ్య, B వెంకటేశ్వర్లు అందరూ గ్రామ రెవిన్యూ అధికారులు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్ కుమార్, గ్రామ సర్వేయర్లు ఖాజావలి, రాము, వినోద్, మురళి, రమేష్ అందరూ గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓ ఆంజనేయులు, నాయకుడు అల్లూరయ్య అందరూ గ్రామ సహాయకులు మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, గిద్దలూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ లోక్కు రమేష్, బిల్లా రమేష్, TDP టౌన్ ప్రెసిడెంట్ షేక్ షేన్శా వలి, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *