అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.
సింగరాయకొండ మండలంలోని ఆవులవారి పాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. CDPO వై. అంజమ్మ ఆధ్వర్యంలో, సూపర్‌వైజర్ ఎస్.కె. సైదాబి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *