తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామ లో ఎంపీడీవో వెంకట్రావు ఆదేశాల మేరకు ( స్పెషల్ ఆఫీసర్) మంగళవారం గ్రామం లోని ప్రజలకు తడి చెత్త మరియు పొడి చెత్త గురించి ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఎప్పటికప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించాలని అలాగే గ్రామ ప్రజలు ఈ చెత్తలోని ప్లాస్టిక్ మరియు ఉపయోగకరమైన వస్తువులు స్వచ్ఛ రథాలకు అందచేసి నిత్యవసర సరుకులు తీసుకోవడం వల్ల మన నిత్యవసర సరుకులు అవసరాలు తగ్గుతాయని గ్రామ ప్రజలకు మరియు పారిశుద్ధ కార్మికులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు