ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.అద్దంకి రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి తిమ్మనపాలెం ఎస్సీ కాలనీలో CASO నిర్వహించి ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు.అదేవిధంగా మేదరమెట్ల ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో జె.పంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జె.వి.పాలెంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఇళ్లను తనిఖీ చేశారు.ఒంగోలు రూరల్ సర్కిల్, ఎన్.జి.పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాదలవాడ గ్రామంలో కూడా విస్తృత CASO నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వస్తువులు, వాహనాలను పరిశీలించి, వాహనాల ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల పత్రాలను పూర్తిస్థాయిలో ధృవీకరించిన అనంతరం తదుపరి అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.అలాగే కొరిసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవాలరావూరు గ్రామంలో ఎన్.జి.పాడు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో CASO నిర్వహించి ఇళ్లను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు.ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *