పూరేటిపల్లి, చిమట గ్రామాల్లో ఇళ్ల తనిఖీలు – రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాలు, ఎన్నికలపై ప్రజలకు అవగాహన
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరేటిపల్లి గ్రామంలో గుడ్లూరు సీఐ గారి ఆధ్వర్యంలో, కొండపి సర్కిల్ ఎస్‌ఐల సహకారంతో CASO నిర్వహించి ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు.అదేవిధంగా మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమట గ్రామంలో మర్రిపూడి ఎస్‌ఐ ఆధ్వర్యంలో CASO ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి అనుమానాస్పద కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.CASO అనంతరం పోలీస్ అధికారులు ప్రజలతో సమావేశమై రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళలు–బాలికలపై నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించిన భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు–బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి CASO ఆపరేషన్లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.