పొనుగోటి వారి పాలెం, మైనంపాడు, మమ్మిడిపాలెం కాలనీల్లో విస్తృత తనిఖీలు – అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొనుగోటి వారి పాలెం గ్రామంలో పోలీసులు CASO నిర్వహించి గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు.అదేవిధంగా ఎస్.ఎన్.పాడు మండలంలోని మైనంపాడు గ్రామంలో ఒంగోలు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్.జి.పాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా CASOలో భాగంగా ఇళ్లను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.అలాగే ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మమ్మిడిపాలెం కాలనీలో ఎస్.ఎన్.పాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో CASO ఆపరేషన్ నిర్వహించి ఇళ్లు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు.ఈ ప్రత్యేక తనిఖీల సందర్భంగా నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు వస్తువులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి CASO ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.