తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో నేడు జరగనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణ & పర్యటన విజయవంతం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గార్లతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ *శ్రీ దామచర్ల సత్య ముఖ్యమంత్రి గారి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని నాయకులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, జోనల్ కో-ఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు గారు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు గారు, సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారు, స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.