స్వచ్ఛ కందుకూరు సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు మున్సిపాలిటీకి కొత్తగా 8 ఈ-ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం అందించగా.. మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం ఆయన వాటిని ప్రారంభించారు. స్వచ్ఛతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్రకు కేటాయించి స్వచ్ఛత ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది అని అన్నారు.ప్రతిఇంట్లో తడిచెత్త, పొడి చెత్తను వేరుచేసి సిబ్బందికి అందజేయాలి. మున్సిపల్‌ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.స్వచ్ఛతలో కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. త్వరలోనే దూబగుంట వద్దనున్న సెగ్రిగేషన్‌ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.కందుకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇళ్లకు వచ్చే ఈ ఇ-ఆటోల వాహనాల్లోనే తడి-పొడి చెత్తను వేరు చేసి అందించాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ (SAC) కందుకూరు మున్సిపాలిటీకి కొత్తగా 8 ఈ-ఆటోలు కేటాయించారని, పర్యావరణానికి హాని చేయని బ్యాటరీ వాహనాల ద్వారా చెత్త సేకరణ జరుగుతుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ కే.అనూష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీను, బెజవాడ ప్రసాద్, వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, రూబీ, దామా రాంబాబు, చుండూరి శ్రీను, ఘట్టమనేని సుబ్బారావు, రాయపాటి శ్రీను, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *