ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గుర్తించి అవసరమైన చోట డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.“డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి” అనే సందేశంతో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *