నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థుల్లో సృజనాత్మకత, స్వయం ఉపాధి ఆలోచనలు మరియు ఆహారంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MEO-1 శ్రీ M S K శర్మ గారు, MEO-2 శ్రీ కె. సుబ్బారెడ్డి గారు, PC పల్లి MRO శ్రీమతి చనమాల ఉష గారు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి, ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ వంటకాలతో పాటు రుచికరమైన అల్పాహారాలు, పానీయాలు మరియు ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శించారు. విద్యార్థులు తమ స్టాళ్లను నిర్వహిస్తూ విక్రయాలు, లెక్కలు, వినియోగదారులతో సంభాషణ వంటి అంశాల్లో ప్రాయోగిక అనుభవాన్ని పొందారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థుల ప్రతిభను, ఉత్సాహాన్ని అభినందించారు. పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు జీవితానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అలాగే పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార వృథాను నివారించడం వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు.పాఠశాల డైరెక్టర్లు వి. మర్రెడ్డి, వి. శాలిని రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ డి. శివ కుమార్, యాజమాన్య ప్రతినిధి కె . శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *