తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ మరియు శ్రీ గాయత్రి ఈ-టెక్నో స్కూల్ రెండు ప్రాంగణాల్లో దసరా పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారి వివిధ రూపాలను ప్రతిబింబించేలా మాతృదేవి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఆలపించిన ప్రత్యేక భక్తి గీతాలు, దసరా పండుగ విశిష్టతను తెలియజేస్తూ చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మ సంబరాలు అందరిలోనూ పండుగ ఉత్సాహాన్ని నింపాయి.ఇలాంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన పెంపొందించడంతో పాటు ఐక్యత, భక్తి భావం, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందించవచ్చని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ ముందస్తు దసరా వేడుకలు రెండు పాఠశాలల ప్రాంగణాల్లో ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.