సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు అలల ఉధృతికి మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ముగ్గురిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు రక్షించారు.కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన సుమారు 70 మంది పోలేరమ్మ జాతర అనంతరం సంప్రదాయం ప్రకారం సముద్ర స్నానానికి పాకల బీచ్‌కు వచ్చారు. స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ అల రావడంతో పలువురు సముద్రంలోకి కొట్టుకుపోయారు.ఈ ప్రమాదంలో పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22) మృతి చెందారు. దేవల విష్ణు, దేవల నారాయణ గల్లంతయ్యారు. మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు, మత్స్యకారులు డ్రోన్లు, పడవల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. సముద్ర స్నానానికి వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *