తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ రైల్వే రోడ్డు ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య కిడ్స్ అసోసియేషన్ చిన్నారులు వినాయక చవితి వేడుకల్లో మిగిలిన విరాళాలను సేవా కార్యక్రమానికి వినియోగించి ఆదర్శంగా నిలిచారు.సామూహిక వినాయక చవితి వేడుకల అనంతరం ఖర్చులు పోను మిగిలిన నగదును సింగరాయకొండ అన్న క్యాంటీన్‌లో చెల్లించి, పేదలకు ఉచిత భోజనం అందించారు.చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను చాటుకున్న చిన్నారులను వినాయక భక్తులు, సనాతన ధర్మ సేవకులు అభినందించారు.