ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిర్మాణాలు, చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబించే కట్టడాలు ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని పలు డివిజన్లలో మొత్తం రూ.6.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ సమతానగర్‌లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు శంకుస్థాపన చేశారు.ఒంగోలు నగరంలోని పీవీఆర్ స్కూల్ జంక్షన్ వద్ద రూ.40 లక్షలతో నిర్మించనున్న హెరిటేజ్ పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా, ఒంగోలు వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. 47వ డివిజన్ పరిధిలోని ఎన్.జి.ఓ. కాలనీలో రూ.78 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించనున్నారు. ఒంగోలు నగరంలోని 48వ డివిజన్ 60 అడుగుల రోడ్డు వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఒంగోలు నగరంలోని శ్రీనివాస థియేటర్ వద్ద రూ.40 లక్షలతో నిర్మించనున్న క్లాక్ టవర్‌కు శంకుస్థాపన చేశారు. నగరంలోని ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది నగర సుందరీకరణకు తోడ్పడటంతో పాటు, ప్రధాన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ఒంగోలు నగరంలోని జాయ్ హాస్పిటల్ సెంటర్ వద్ద రూ.40 లక్షలతో నిర్మించనున్న గ్రానైట్ మాన్యుమెంట్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఒంగోలు నగరంలోని జయరాం థియేటర్ సెంటర్ వద్ద రూ.30 లక్షలతో నిర్మించనున్న అశోక చక్ర స్తూపానికి శంకుస్థాపన చేశారు. భారతదేశ జాతీయ చిహ్నాల స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ నిర్మాణం ద్వారా నగరంలోని ప్రధాన కూడలికి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఒంగోలు నగరంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రధాన కూడళ్ల సుందరీకరణకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం, నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో అవసరమైన పనులను చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *