తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపడుతున్నారు.ఈ తనిఖీల్లో భాగంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలను పరిశీలిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-చలాన్లు విధిస్తున్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ఉపయోగించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు ప్రజల భద్రత కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించి, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ప్రకాశం జిల్లా పోలీసులు పిలుపునిస్తున్నారు.