సింగరాయకొండ సమీపంలో ఉన్న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రసన్న కాలభైరవ స్వామి వారీ దేవస్థానంలో శనివారం తెల్లవారుజాము నుంచి కూష్పాండ, దీపారాధనలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు జరిగాయి.జాతకరీత్యా, గోచార రీత్యా , అష్టమ అర్ధాష్టమ ఏలనాటి అంతర్దశ అంతరాంతర్ దశ శనేశ్వర దోషాలకు విశేషంగా శనీశ్వరునికి తిల తైలాభిషేకము,తిలధానాలను నిర్వహించారు. ఆలయము భక్తులతో రద్దీగాకనిపించింది. మహిళలు విశేషంగా భారీ ఎత్తున తరలి వచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. అన్న సంతర్పణ కార్యక్రమoలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికినెల్లూరు విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
వాలంటీర్లు పర్య వేక్షణ…
భక్తులకు అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనము, అన్న సంతర్పణ కార్యక్రమాలు, తదితర వాటి వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ సిబ్బంది! భక్తులు ఆటో, మోటార్ సైకిల్స్, తదితర వాహనాలు
రాకపోకలను చేసేందుకు
అంతరాయము లేకుండా సింగరాయకొండ సిఐ వై. శ్రీహరి పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు.
పాత శెట్టి రామ్మోహన్రావు, ఈశ్వరి దంపతులు సహాయ, సహకారాలు మరువలేనివి.. ఆలయ అభివృద్ధికి రామ్మోహన్ రావు దంపతులతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాసరావు అహరిస్నలు పాటుపడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *