తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 45వ విడతలో భాగంగా కందుకూరు టీడీపీ కార్యాలయంలో 122 మంది లబ్ధిదారులకు రూ.58.36 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశాను.▪️ గుడ్లూరు మండలం – 41 మందికి రూ.20,30,572
▪️ కందుకూరు అర్బన్ – 6 మందికి రూ.3,38,659
▪️ లింగసముద్రం మండలం – 32 మందికి రూ.14,86,088
▪️ ఉలవపాడు మండలం – 37 మందికి రూ.16,82,405
▪️ వలేటివారిపాలెం మండలం – 3 మందికి రూ.1,48,583
▪️ LOC ద్వారా – ఒకరికి రూ.49,492 ఇప్పటివరకు కందుకూరు నియోజకవర్గంలో 1,982 మంది లబ్ధిదారులకు సుమారు రూ.15 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాం.అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సంక్షేమం కోసం మరింతగా పనిచేస్తాను.