స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శి టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి అధ్యక్షతన బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.బీసీలకు రాజకీయంగా నాయకత్వ అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సామాజిక న్యాయ స్ఫూర్తిని కొనసాగిస్తూ, బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు మండలాల టీడీపీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.బీసీలు ఐక్యంగా ఉండి, అవకాశాలు పొందిన నాయకులను గెలిపించుకోవాలని, పదవుల కోసం కాకుండా బీసీల రాజకీయ భవిష్యత్తు కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో బీసీ సోదరులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాల టీడీపీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.