తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
లింగసముద్రం మండలం రాచెరువు రాజుపాలెం (RR పాలెం) గ్రామానికి చెందిన 18 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. కందుకూరులో నా సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న వారందరికీ పార్టీలోకి సాదర స్వాగతం పలికాను. గ్రామ టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ చండ్ర తిరుపతయ్య తదితర నాయకుల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. గత రెండేళ్లుగా కందుకూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నాం.గత ప్రభుత్వంలో బటన్ నొక్కుడుకే పరిమితమైన పాలనకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే మా లక్ష్యం.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.