తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్ఓ శ్రీదేవి, ఆర్డీఓ వెంకట శివరామి రెడ్డి తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.