టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థినీ విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ, కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అనుభవం కలిగిన, ఉన్నత అర్హతలు గల అధ్యాపకులు ఉన్నారని, వారిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.అకడమిక్ కో-ఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీహరి మాట్లాడుతూ, కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, క్రీడా సౌకర్యాలు, మహిళా సాధికారత విభాగం, జాతీయ సేవా పథకం వంటి అనేక విభాగాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్నాయని, ఈ కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. కె.వి. పద్మావతి, డా. సి.హెచ్. శ్రీనివాసరావు, డా. పి. రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *