ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కొండపి ఎస్‌ఐ గారు సిబ్బందితో కలిసి కొండపి మండల పరిధిలోని కె. ఉప్పలపాడు గ్రామంలో అక్రమ జూదంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమ జూదానికి పాల్పడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ₹51,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అక్రమ జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *