తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రతను పటిష్టం చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులకు చెందిన బీడీ (BD) టీమ్స్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన వ్యాపార కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.ప్రజలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే రవాణా కేంద్రాలు, రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచుతూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.