తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి ఇనమనమెళ్లూరు గ్రామంలో అక్రమ పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమ పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి ₹10,190 నగదును స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజల్లో చట్టంపై అవగాహన పెంపొందించడం, శాంతిభద్రతలను కాపాడడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.ప్రజలు అక్రమ జూదానికి దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.