తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రజలు కట్టిన పన్నులతో, ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ రైల్వే స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రయాణికులు బాధ్యతగా సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం పాల్ ఎనోచ్ ఎడ్విన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ప్రకాశం జిల్లా, సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిర్మాణాలు, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే నెలలో సింగరాయకొండ అమృత్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ రైల్వే అంటే ప్రభుత్వానిదే కాదని, పన్నులు చెల్లించే ప్రయాణికులు, ప్రజలందరిదీనని, దీనిని బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని ఏడీఆర్ఎం కోరారు. ఆయన వెంట రైల్వే అధికారులు పాల్గొన్నారు.
