రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు – మామిడిపాలెం కాలనీలో CASO ఆపరేషన్ నిర్వహణ, 15 వాహనాలు స్వాధీనం!
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారు, EAGLE బృందంతో కలిసి ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపాలెం కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి, మొత్తం 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా, ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలను కొనసాగిస్తున్నారు.