తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :-
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ద్వారా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం, రాముడిపాళెం గ్రామాల్లో 1,251 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశాను.ఇందుకూరుపేట మండలంలోని 16 గ్రామాలకు మొత్తం 8,394 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందించాం. మండలంలో రీ-సర్వే ప్రక్రియతో పాటు పాసు పుస్తకాల పంపిణీ కూడా పూర్తయింది. రైతుల భూములపై హక్కులను ధ్రువీకరించి, వారికి భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులకు మంచి దిగుబడులతో పాటు మెరుగైన ఆదాయం లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు, వారి అభివృద్ధికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.