ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రత కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో కురిచేడు ఎస్‌ఐ గారు, సిబ్బందితో కలిసి, దొనకొండ ఎస్‌ఐ గారు మరియు వారి సిబ్బంది సహకారంతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం గ్రామ ప్రజలతో పోలీసులు మాట్లాడి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యతలు, నేరాలకు దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల భద్రత, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *