కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారితో కలిసి 120 మంది లబ్ధిదారులకు రూ.51.87 లక్షల విలువైన చెక్కులను అందజేశాను.నియోజకవర్గంలో ఇప్పటివరకు 46 విడతలుగా 2,102 మంది లబ్ధిదారులకు రూ.15.15 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉంది.కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నాను. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు CMRF ఒక భరోసాగా నిలుస్తోంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత పట్టుదలతో పనిచేస్తాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *