గత రెండేళ్ల మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, పట్టణాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తాం.గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అభివృద్ధికి జరిగిన విఘాతం, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రజలకు మరోసారి గుర్తుచేస్తాం. గత ఐదేళ్లలో వారు ఏం చేశారు? ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల ముందుంచుతాం.ఈ నియోజకవర్గంలో 5 ఎంపీపీలు, 5 జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, 40 మంది కౌన్సిలర్లు, 91 గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త 24 గంటలూ కష్టపడి పనిచేస్తాం.అభివృద్ధి చేసిన వారికే ప్రజల మద్దతు.. సంక్షేమం అందించిన వారికే ప్రజల ఆశీర్వాదం!మా రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మా విజయానికి పునాది. ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు సమష్టిగా ముందుకు సాగుతాం. అంతిమంగా ప్రజలే తీర్పు ఇస్తారు.. ప్రజా తీర్పే మాకు శిరోధార్యం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *