తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో రూ.120 కోట్ల వ్యయంతో అమృత్ 2.0 పథకం పనులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్ గారు,మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 8 వేల కుళాయిలు ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.