తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. HAM పథకం ద్వారా దర్శి మున్సిపాలిటీలోని 2, 6, 7, 8, 12, 15, 19, 20 వార్డుల్లో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగమయ్యణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.