తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.45,44,427 విలువైన చెక్కులను 83 మంది లబ్ధిదారులకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులపాలు కాకుండా అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, పిడతల నేమిలయ్య, పుల్లలచెరువు సత్యనారాయణతో పాటు టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.