కూటమి అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలి
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ విశాఖ:-
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్థానిక ఎన్నికలపై బుధవారం నాడు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో GVMC ఎన్నికల పరిశీలకులు ఎం.ఏ షరీఫ్ మరియు జిల్లా ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా…మంత్రి డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ… జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. కూటమి రెండున్నరేళ్ల పాలనలోనే విశాఖ నగరానికి పెద్ద ఎత్తున కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వైసీపీ హయాంలో విశాఖ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కూటమి పాలనలో నగరంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలంతా కూటమి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేయాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.