0-3936x1728-0-0#

విద్యార్థి తొషిక్‌ ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి, సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతోందని, విద్యార్థుల భద్రత విషయంలో సంబంధిత మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని నిలదీశారు. హాస్టళ్లలోని విద్యార్థుల భద్రతను పర్యవేక్షించడంలో అధికారులు, సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.తొషిక్‌ ఘటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *