అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నామినేషన్ల స్వీకరణకు అవసరమైన స్టేషనరీ, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.