దర్శి టీడీపీ కార్యాలయంలో గురువారం దర్శి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారితో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, ప్రజాబలం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని రాంభూపాల్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడం ఖాయమని, ప్రజల్లో కూటమి పట్ల ఆదరణ స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *