తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని క్యాంపు కార్యాలయం నందు కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ మాగుంట కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కందుకూరు నియోజకవర్గం తెలుగుమహిళ మాజీ అధ్యక్షురాలు దివి సౌభాగ్యమ్మ , నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం మాజీ కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు…..