తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో 28 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొత్తం 30,633 మంది ఓటర్లు ఉండగా, నామినేషన్ల స్వీకరణకు 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 28న పోలింగ్, 30న ఫలితాలు వెల్లడించనున్నారని సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణబాబు తెలియజేశారు.