తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఒంగోలు పార్లమెంటు కమిటీ సభ్యులు ఐనాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, కాసుల శ్రీకాంత్ మరియు కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు కనపర్తి మనోజ్ కుమార్, కందుకూరి రాంబాబు, పిల్లిపోగు పీటర్ బాబు కలసి సమావేశం నిర్వహించారు. అతి తొందరలో జరగబోవు స్థానిక ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలి అని ఆశా భావం వ్యక్తపరుస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గర పూర్తి సమాచారం సేకరించి పార్లమెంటు కమిటీ ద్వారా పార్టీ అధిష్టానం దృష్టికి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది, మన కొండేపి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు, పార్టీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ మండలాల కమిటీ సభ్యులు, నిర్వాహక్ దళ్ 32 మంది సభ్యులు, సపోర్ట్ టీం 5 మంది సభ్యులు ప్రతి ఒక్కరు 18-10-2026 ఆదివారం ఉదయం 10 గంటలకు పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నాము అని ఈరోజు జరిగిన ఈ సమావేశంలో చర్చించుకున్న అంశాలు. ముఖ్య గమనిక
స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయానికి పూర్తి సమాచారంతో (బయోడేటా తో) జనసేన పార్టీ సభ్యత్వం నెంబర్ తో సహా రావలెను.