ఒంగోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రత, రక్షణ పై భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్ నుండి గోరెంట్ల కాంప్లెక్స్ ప్రాంతంలో, జయరాం టాకీస్ నుండి గద్దలగుంట వరకు అంబికా షాపింగ్ మాల్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు ముఖ్య కూడళ్లు/కేంద్రాలు మరియు ఇతర ప్రాంతాల్లో పోలీసులు తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహణలో ఒంగోలు డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు తోడుంటారని, ప్రజలు అధైర్య పడకుండా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజలకు భద్రత కల్పించుటకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియచేసారు. ప్రజలు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినా, గొడవలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాగ్ మార్చ్ లో ఒంగోలు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, టూ టౌన్ సిఐ వీరనాయక్, తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ట్రాఫిక్ సిఐ హాజరత్తయ్య, ఎస్ఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *