రెండున్నరేళ్లలో బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటేయాలి: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
– ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
– బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దొడ్ల విజయలక్ష్మి నామినేషన్‌
– నామినేషన్‌కు ముందు వేమిరెడ్డి దంపతుల నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన విజయలక్ష్మి
– 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులు.. బీజేపీకి 3, జనసేనకు 3 వార్డుల కేటాయింపు బుచ్చిరెడ్డిపాళెంలో గత రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు. శనివారం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కూటమి తరఫున ఎంపికైన శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అంతకుముందు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నివాసానికి వెళ్లిన విజయలక్ష్మి గారు, తనకు కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. 28 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నిర్దేశించిన మేరకు సీనియర్‌ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. మొత్తం 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారని, కూటమి ధర్మంలో భాగంగా బీజేపీకి మూడు, జనసేన పార్టీకి మూడు వార్డులు కేటాయించినట్లు వివరించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *